ట్రంప్ భారీ విజయ ఆర్చ్ నిర్మాణానికి బ్రేక్: జడ్జి ఉత్తర్వులు జారీ

రిపోర్టర్: కృష్ణ స్థలం: Washington

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన భారీ విజయ ఆర్చ్ నిర్మాణాన్ని కోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. వాషింగ్టన్ లో రెండు వందల యాభై అడుగుల ఎత్తైన ఆర్చ్ నిర్మాణానికి కమిషన్ ఆమోదం తెలిపిన వెంటనే, డిస్ట్రిక్ట్ జడ్జి తన్యా చుట్కాన్ పద్నాలుగు రోజుల పాటు స్టే ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు న్యాయవర్గాలు వెల్లడించాయి. ఈ ప్రాజెక్టు వల్ల తీవ్ర ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతాయని ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు.