హర్యానాలో ఉద్రిక్తత: పదో తరగతి విద్యార్థి మృతితో పోలీస్స్టేషన్పై గుంపు దాడి

రిపోర్టర్: కృష్ణ స్థలం: ఫరీదాబాద్

ఫరీదాబాద్లో పదో తరగతి విద్యార్థి అర్జున్ అనుమానాస్పద మృతి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. బాలిక ఇంటి వద్ద అర్జున్ మృతదేహం లభించడంతో అతడి కుటుంబ సభ్యులు హత్య ఆరోపణలు చేస్తూ ఆందోళనకు దిగారు. ఈ ఘటనలో పోలీసులు, ఆందోళనకారుల మధ్య ఘర్షణ జరిగి ఇద్దరు పోలీసులు గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఘటనా స్థలానికి అదనపు బలగాలను రప్పించి పరిస్థితిని అదుపులోకి తెచ్చామని, నలుగురిని అరెస్టు చేశామని పోలీసులు స్పష్టం చేశారు.