ఢిల్లీలో అరుదైన వైద్య ఘటన: యువకుడిలో గర్భసంచి గుర్తింపు

రిపోర్టర్: హరి స్థలం: New Delhi

ఢిల్లీలో అరుదైన వైద్య ఘటన వెలుగు చూసింది. సంతానలేమి సమస్యతో ఆస్పత్రికి వెళ్లిన 26 ఏళ్ల యువకుడికి వైద్యులు పరీక్షలు నిర్వహించగా.. పురుషులలో ఉండాల్సిన లక్షణాలతో పాటు మహిళల లాంటి పూర్తిస్థాయి గర్భసంచి, అండాలు ఉన్నట్లు గుర్తించారు. దీనిని పెర్సిస్టెంట్ ముల్లేరియన్‌ డక్ట్‌ సిండ్రోమ్‌గా వైద్యులు తెలిపారు. క్యాన్సర్‌ ముప్పు పొంచి ఉండటంతో శస్త్రచికిత్స ద్వారా గర్భసంచి, వృషణాలను తొలగించి ప్రాణాలు కాపాడారు.