న్యాయవాదులకు రూ.5 లక్షల క్యాష్‌లెస్ బీమా: సీఎం యోగి
రిపోర్టర్: సునీల్
స్థలం: ఉత్తరప్రదేశ్
ఉత్తరప్రదేశ్‌లో 2017కి ముందు పాలన, శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని సీఎం యోగి ఆదిత్యనాథ్ విమర్శించారు. ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రాక్టీసింగ్ న్యాయవాదులకు రూ.5 లక్షల వరకు క్యాష్‌లెస్ బీమా పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించారు. అలాగే 400 మంది లా ఆఫీసర్లకు ట్యాబ్లెట్లు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. పోలీస్ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేశామని స్పష్టం చేశారు.