స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలతో భగ్గుమన్న శ్యామ్ నాయక్
రిపోర్టర్: Gangadhar Reporter
స్థలం: జన్నారం
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఆసిఫాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్ తీవ్రంగా ఖండించారు. జైనూర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో నిరసన కార్యక్రమం చేపట్టారు. రాజ్యాంగబద్ధ పదవులకు గౌరవం ఇవ్వాలని, ప్రజాప్రతినిధులు బాధ్యతాయుతమైన భాష మాట్లాడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.