రోహిత్ శెట్టి గొప్ప మనసుపై ప్రశంసల వర్షం కురిపించిన జాస్మిన్ భాసిన్
రిపోర్టర్: రమేష్
స్థలం: ముంబై
ప్రముఖ స్టంట్ రియాలిటీ షో ఖత్రాన్ కే ఖిలాడీ 15 లో భయంతో ఇబ్బంది పడుతున్న నటి జాస్మిన్ భాసిన్ ను మోటివేట్ చేయడానికి స్వయంగా రంగంలోకి దిగిన ప్రముఖ దర్శకుడు, హోస్ట్ రోహిత్ శెట్టిపై ఆమె ప్రశంసల వర్షం కురిపించారు. తన కోసం షాక్స్ తీసుకుంటూ రోహిత్ శెట్టి చేసిన సాహసం తన మనసును హత్తుకుందని, ఆయన తనను ఎల్లప్పుడూ ముందుకు నడిపించే నిజమైన మెంటార్ అని జాస్మిన్ భాసిన్ కొనియాడారు.