తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ మరియు దర్శన వివరాలు

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: Tirumala

తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించిన తాజా వివరాలను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారికంగా వెల్లడించింది. భక్తుల రద్దీ నేపథ్యంలో వేచి ఉండే గదుల సంఖ్య 31కి చేరిందని, టోకెన్లు లేని సర్వదర్శనానికి దాదాపు 12 గంటల సమయం పడుతోందని TTD స్పష్టం చేసింది. గత సెప్టెంబర్ 23వ తేదీన మొత్తం 67,534 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, 25,411 మంది తలనీలాలు సమర్పించారు. అదే రోజు హుండీ ఆదాయం రూ.3.40 కోట్లుగా నమోదైందని, భక్తులకు 3.95 లక్షల లడ్డూలను ప్రసాదంగా విక్రయించినట్లు TTD పేర్కొంది.