ఏలూరులో వినాయక ఉరేగింపులపై డ్రోన్ల ద్వారా నిఘా
రిపోర్టర్: సురేష్
స్థలం: ఏలూరు
ఏలూరులో వినాయక ఉరేగింపుల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఉత్సవాల్లో శాంతిభద్రతల పరిరక్షణ కోసం డ్రోన్ల ద్వారా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రజలు, భక్తులు ప్రశాంత వాతావరణంలో వేడుకలు జరుపుకునేలా పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండి విధులు నిర్వహిస్తున్నారు.