ప్రజా పాలన దినోత్సవ వేడుకలతో పులకించిన ఆమనగల్ మార్కెట్
రిపోర్టర్: Abdul Azeem
స్థలం: ఆమనగల్
ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆమనగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో ప్రజా పాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్పర్సన్ యాట గీత నరసింహ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ప్రజా రంజక పాలనలో భాగంగా ప్రభుత్వం ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తోందని, రైతులు మరియు ప్రజల సంక్షేమమే ధ్యేయంగా మార్కెట్ కమిటీ పనిచేస్తుందని ఆమె స్పష్టం చేశారు. మార్కెట్ యార్డుకు వచ్చే రైతన్నలకు అన్ని రకాల వసతులు కల్పిస్తూ పారదర్శకమైన సేవలు అందిస్తామని ఈ వేడుకల సందర్భంగా చైర్పర్సన్ హామీ ఇచ్చారు.