మంచిర్యాల జిల్లాలో తెల్ల కల్లు విక్రయాలపై నార్కోటిక్ బృందం ఆకస్మిక దాడులు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: మంచిర్యాల

మంచిర్యాల జిల్లాలో తెల్ల కల్లు విక్రయాలపై పోలీసులు ఆకస్మిక దాడులతో హడలెత్తించారు. కల్తీకల్లు విక్రయాలు సాగుతున్నాయని ఉన్నత అధికారులకు వచ్చిన ఫిర్యాదుల మేరకు హైదరాబాదు నుంచి నార్కోటిక్ బృందం తనిఖీలు చేపట్టింది. మంచిర్యాల ఏసీపీ ప్రకాష్, సీఐ ప్రమోద్ రావుతో కలిసి దుకాణాలతో పాటు వ్యాపారుల ఇళ్లలో తనిఖీలు చేపట్టారు. కల్లు సీసాలను సీజ్ చేసి నమూనాలు సేకరించారు. దాడుల వివరాలు చెప్పేందుకు పోలీసులు నిరాకరించారు.