నిర్మల్ లో గులాబీ యువగర్జన సభ: కేటీఆర్ సమక్షంలో భారీగా చేరికలు

రిపోర్టర్: రాము స్థలం: నిర్మల్

నిర్మల్ జిల్లా కేంద్రంలో ఈ నెల పదకొండో తేదీన గులాబీ యువగర్జన బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో జరిగే ఈ సభ ద్వారా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పట్టు నిరూపించుకోవాలని గులాబీ దళం వ్యూహరచన చేస్తోంది. బీజేపీ పాదయాత్రకు దీటుగా భారీ జనసమీకరణ చేపడుతున్నట్లు ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పేర్కొన్నారు.