విద్యార్థులకు గుడ్ న్యూస్: విడుదలైన ఏపీ లాసెట్ సీట్ల కేటాయింపు ఫలితాలు
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: అమరావతి
ఏపీ లాసెట్ ప్రథమ విడత సీట్ల కేటాయింపు ఫలితాలను రాష్ట్ర ఉన్నత విద్యామండలి విడుదల చేసిందని అధికారులు తెలిపారు. మూడేళ్లు, ఐదేళ్ల ఎల్ఎల్బీ కోర్సుల్లో ప్రవేశాల కోసం కౌన్సిలింగ్లో పాల్గొన్న అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా సీట్ల కేటాయింపు వివరాలను పరిశీలించుకోవచ్చని వెల్లడించారు. సీట్లు పొందిన విద్యార్థులు అక్టోబర్ ఏడో తేదీ నుంచి తొమ్మిదో తేదీలోపు సంబంధిత కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాలని అధికారులు స్పష్టం చేశారు.