నకిలీ ఎస్టీ సర్టిఫికెట్లతో ఎంబీబీఎస్ సీట్ల దరఖాస్తులపై తీవ్ర ఆందోళన
రిపోర్టర్: కృష్ణ
స్థలం: Hyderabad
తెలంగాణలో నకిలీ ఎస్టీ సర్టిఫికెట్లతో ఎంబీబీఎస్ సీట్లు పొందేందుకు ఇతర రాష్ట్రాల విద్యార్థులు యత్నిస్తున్నారని Telugu Scribe వెల్లడించారు. మహారాష్ట్ర, రాజస్థాన్, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన కొందరు విద్యార్థులు అధికారులకు లంచాలు ఇచ్చి అక్రమంగా ఎస్టీ ధ్రువీకరణ పత్రాలు సంపాదించారని పేర్కొన్నారు. రిజర్వేషన్ కోటాలో వైద్య సీట్లు దక్కించుకునేందుకు ఈ మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. ఈ భారీ అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.