పేదల ఇళ్ల పట్టాల పంపిణీ చేపట్టిన చంద్రబాబు

రిపోర్టర్: సునీల్ స్థలం: కర్నూలు

కర్నూలు ప్రాంతంలో పేదల ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా పాల్గొని అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. సొంతింటి కల సాకారం దిశగా ప్రభుత్వం చేపడుతున్న ఈ కార్యక్రమంపై ప్రజల నుంచి హర్షం వ్యక్తమవుతోంది.