కలడి సంస్కృత విశ్వవిద్యాలయం సస్పెన్షన్ వివాదం: సుప్రీంకోర్టును ఆశ్రయించిన విద్యార్థులు
రిపోర్టర్: శివ
స్థలం: కేరళ
కేరళలోని శ్రీ శంకరాచార్య సంస్కృత విశ్వవిద్యాలయానికి చెందిన పదహారు మంది సస్పెండెడ్ విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యేందుకు అనుమతించాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేరళ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ అత్యవసర విచారణ కోరారు. క్యాంపస్ లో జరిగిన నిరసనల సమయంలో వైస్ ఛాన్సలర్ పై దాడి ఆరోపణలతో వీరు సస్పెన్షన్ ఎదుర్కొంటున్నట్లు పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అత్యున్నత న్యాయస్థానం తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.