పులివెందులలో శాంతిభద్రతల సమస్యకు జగన్ రెడ్డియే కారణమంటూ మంత్రి లోకేష్ ఫైర్

రిపోర్టర్: భాస్కర్ స్థలం: బెంగళూరు

రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలనలో స్థానిక సంస్థల ఎన్నికలు అత్యంత పారదర్శకంగా జరుగుతున్నాయని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. బెంగళూరులో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పులివెందులలో శాంతిభద్రతల సమస్య సృష్టించడంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఖరే ప్రధాన కారణమని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గతంలో ఏకగ్రీవాలు చేసిన వారు నేడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం హాస్యాస్పదమని, ఎన్నికల్ లో సమస్యలు సృష్టించి ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన విమర్శించారు.