అకాల్ తఖ్త్ నుంచి అమర్జిత్ సింగ్ చావ్లా బహిష్కరణ
రిపోర్టర్: కిరణ్
స్థలం: అమృత్‌సర్
అమృత్‌సర్‌లోని అకాల్ తఖ్త్ అత్యున్నత పీఠం కీలక నిర్ణయం తీసుకుంటూ ఎస్‌జీపీసీ సభ్యుడు అమర్జిత్ సింగ్ చావ్లా మరియు గోల్డెన్ టెంపుల్ అదనపు హెడ్ గ్రంథి మల్కిత్ సింగ్‌లను ఖల్సా పంత్ నుంచి బహిష్కరించింది. అత్యాచారం, లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో సిఖ్ సంస్థల్లో వీరు జీవితకాలం పనిచేయకుండా నిషేధం విధించారు. అకాల్ తఖ్త్ తాత్కాలిక జతేదార్ కుల్దీప్ సింగ్ గర్జాజ్ అమృత్‌సర్‌లో ఈ సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు.