జాంబీ రెడ్డి 2 సినిమాలో ఉపేంద్ర ఫస్ట్ లుక్ విడుదల

రిపోర్టర్: రాజేష్ స్థలం: హైదరాబాద్

కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర పుట్టినరోజు సందర్భంగా టాలీవుడ్ మోస్ట్ అవేటెడ్ సీక్వెల్ జాంబీ రెడ్డి 2 చిత్రం నుంచి మేకర్స్ ఆయన ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. సూపర్‌హీరో తేజ సజ్జా హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ఉపేంద్ర అత్యంత వైవిధ్యమైన, మాస్ అవతార్‌లో కనిపించనున్నారు. ప్రపంచాన్ని తలకిందులు చేసేలా రూపొందించిన ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, వీరిద్దరి కలయికపై భారీ అంచనాలు నెలకొన్నాయి.