బీహార్‌లో మరో లైంగిక వేధింపుల ఘటనపై పోలీసుల దర్యాప్తు

రిపోర్టర్: సునీల్ స్థలం: సమస్తిపూర్

బీహార్‌లోని సమస్తిపూర్ జిల్లాలో యువతిని వేధించిన ఘటన కలకలం సృష్టించింది. జగత్‌సింగ్‌పూర్ గ్రామంలో రోడ్డుపై వెళ్తున్న జంటను కొందరు వ్యక్తులు అడ్డగించి అసభ్యంగా ప్రవర్తించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు తీవ్రంగా స్పందించారు. నిందితుల గుర్తింపు కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించామని, ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని పోలీస్ అధికారి అరవింద్ ప్రతాప్ సింగ్ స్పష్టం చేశారు.