కుల్చా జోడీపై కుల్దీప్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు: రికార్డులపై స్పష్టత

రిపోర్టర్: సతీష్ స్థలం: New Delhi

యుజ్వేంద్ర చాహల్ రికార్డును దాటడంపై టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ స్పందించారు. చాహల్ తో కలిసి ఆడి ఉంటే మరిన్ని రికార్డులు సాధించేవాళ్లమని కుల్దీప్ యాదవ్ అభిప్రాయపడ్డారు. వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్కు ముందు జియోస్టార్ తో జరిగిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చాహల్ తో కలిసి బౌలింగ్ చేయడం తనకు ఎప్పుడూ ప్రత్యేకమేనని, మైదానంలో పంచుకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ కుల్దీప్ యాదవ్ భావోద్వేగానికి గురయ్యారు.