వర్షపు నీటిని ఒడిసిపట్టి రిజర్వాయర్లు నింపాలని సీఎం చంద్రబాబు ఆదేశం

రిపోర్టర్: సురేష్ స్థలం: Amaravati

రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలతో వస్తున్న ప్రతి నీటి ప్రవాహాన్ని ఒడిసిపట్టి రిజర్వాయర్లు, చెరువులను నింపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అమరావతి సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రంలో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ, అవసరమైన చోట మొబైల్ లిఫ్ట్‌లు, మోటార్లను వినియోగించి నీటిని ఎత్తిపోసి నిల్వ చేయాలని స్పష్టం చేశారు. గోదావరి, కృష్ణా బేసిన్లలో పెరుగుతున్న ప్రవాహాలపై ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆయన దిశానిర్దేశం చేశారు.