పత్తి కొనుగోళ్లపై ఏపీ ప్రభుత్వం ఎస్‌ఓపీ జారీ

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: అమరావతి

రాష్ట్రంలో సీసీఐ గుర్తించిన కేంద్రాల్లోనే పత్తి కొనుగోలు చేయాలని ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. ఈ-పంట నమోదు ఆధారంగా రైతులను గుర్తించి, కపాస్‌ కిసాన్‌ యాప్‌ ద్వారా స్లాట్‌ బుకింగ్‌ చేసుకోవాలని సూచించింది. గతేడాది ఎదురైన సమస్యలను దృష్టిలో ఉంచుకుని పకడ్బందీగా కొనుగోళ్లు చేపట్టాలని వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్‌ స్పష్టం చేశారు.