రాజాపేటలో ఏకాదశి సందర్భంగా ఘనంగా భక్తిశ్రద్ధలతో నగర సంకీర్తన

రిపోర్టర్: K.Shekhar స్థలం: రాజాపేట

రాజాపేట మండల కేంద్రంలో ఏకాదశి పర్వదినం సందర్భంగా మంగళవారం నగర సంకీర్తన అత్యంత భక్తిశ్రద్ధలతో జరిగింది. మార్కుక్ శ్రీ బావానంద స్వామి వారి ఆశీస్సులతో ఈ కార్యక్రమం నిర్వహించారు. శ్రీ రామకృష్ణ సాయి మందిరం నుండి ప్రధాన వీధుల గుండా సాగిన ఈ సంకీర్తనలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.