బీఆర్ఎస్ పోరాటంతోనే సాగునీటి విడుదల: కందాల ఉపేందర్ రెడ్డి
రిపోర్టర్: kasanivenkatesh
స్థలం: నేలకొండపల్లి
పాలేరు రిజర్వాయర్ నుంచి సాగునీటిని విడుదల చేయాలని సెప్టెంబర్ 2న బీఆర్ఎస్ చేపట్టిన మహా ధర్నా ఫలించిందని మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి పేర్కొన్నారు. తమ నిరసనతోనే ప్రభుత్వం దిగివచ్చి నీటి విడుదలకు ఆదేశాలు జారీ చేసిందని ఆయన స్పష్టం చేశారు.
రైతుల పక్షాన నిలబడి చేసిన పోరాటానికి ఈ నీటి విడుదలే నిదర్శనమని కందాల అన్నారు. పంటలు ఎండిపోతుంటే చూస్తూ ఊరుకోబోమని, రైతుల ప్రయోజనాల కోసం నిరంతరం పోరాడుతామని ఆయన హెచ్చరించారు. ఈ విజయం రైతులందరిదని ఆయన పేర్కొన్నారు.