తెలంగాణలో పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరిక

రిపోర్టర్: శివ స్థలం: హైదరాబాద్

తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న రెండు నుంచి మూడు గంటల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి హైదరాబాద్ కేంద్రం వెల్లడించింది. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, ఖమ్మం, కొమరంభీమ్ ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, ములుగు, నిర్మల్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో వర్షాలు పడే సూచనలున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసినట్లు వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.