స్థానిక ఎన్నికల్లో తెదేపా జెండా ఎగరవేస్తాం: జడ్పీ ఛైర్మన్ శ్రీనివాసరావు
రిపోర్టర్: రాజేష్
స్థలం: విజయనగరం
స్థానిక సంస్థల ఎన్నికల్లో వందశాతం స్థానాలు గెలుపొందేలా సమన్వయంతో పనిచేస్తామని జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడతానని తెలిపారు. కూతురు సిరిసహస్రతో కలిసి విజయనగరం తెదేపా కార్యాలయంలో అడుగుపెట్టిన ఆయన, ఎమ్మెల్యే అదితి గజపతిరాజును కలిశారు. గోవా గవర్నర్ అశోక్‌గజపతిరాజు ఆశీస్సులు తీసుకుని జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.