పల్లెర్లలో ఘనంగా ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహ భూమి పూజ
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: ఆత్మకూరు(ఎం)
యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలంలోని పల్లెర్ల గ్రామంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహ నిర్మాణానికి భూమి పూజ ఘనంగా జరిగింది. చేనేత మిశ్రమ సహకార సంఘం ఆవరణలో సంఘం అధ్యక్షులు పొడుగు వెంకటేశం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా వెంకటేశం మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన పద్మశాలి జాతిపిత కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం గర్వకారణమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చేనేత సంఘం ప్రతినిధులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.