బరువు తగ్గే ప్రయాణంలో ఎదుర్కొన్న కష్టాలను వెల్లడించిన నటి ఖుష్బూ

రిపోర్టర్: నరేష్ స్థలం: చెన్నై

ప్రముఖ నటి ఖుష్బూ తన అద్భుతమైన బరువు తగ్గే ప్రయాణం వెనుక ఉన్న కష్టాలను ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఒక దశలో తన బరువు 98.6 కిలోలకు చేరిందని, మోకాళ్ల నొప్పులు తీవ్రంగా వేధించడంతో శస్త్రచికిత్స జరిగిందని ఆమె తెలిపారు. కుటుంబ సభ్యుల ప్రేరణతో 2021లో బరువు తగ్గే ప్రయత్నాలు మొదలుపెట్టి, దాదాపు 38 నుండి 40 కిలోల వరకు బరువు తగ్గి సరికొత్త రూపును సంతరించుకున్నట్లు ఖుష్బూ స్పష్టం చేశారు.