పారిశ్రామిక దిగ్గజం ఏవీఎస్ రాజు కన్నుమూత: తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం

రిపోర్టర్: రాము స్థలం: అమరావతి

ప్రముఖ నిర్మాణ సంస్థ ఎన్సీసీ వ్యవస్థాపకులు, పద్మశ్రీ డాక్టర్ అల్లూరి వెంకట సత్యనారాయణ రాజు కన్నుమూశారని సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఆయన మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జిల్లా అంతర్వేదిపాలెంలో జన్మించిన ఏవీఎస్ రాజు, దేశ నిర్మాణానికి, అభివృద్ధికి అందించిన సేవలు చిరస్మరణీయమని, ఆయన మృతి పారిశ్రామిక రంగానికి తీరని లోటని నాయకులు పేర్కొన్నారు.