ఓటింగ్లో రికార్డు: ఎనభై శాతానికి పైగా ఓట్లు వేసి అనసూయనగర్ ఓటర్ల ఆదర్శం

రిపోర్టర్: సునీల్ స్థలం: సంగం

సంగం మండలంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అనసూయనగర్, జంగాల కండ్రిక గ్రామాల ఓటర్లు అత్యధిక పోలింగ్ నమోదు చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారని అధికారులు తెలిపారు. మండలంలోని అనసూయనగర్ పోలింగ్ కేంద్రంలో 87.75 శాతం, జంగాల కండ్రికలో 82.89 శాతం ఓట్లు నమోదయ్యాయని, ప్రజాస్వామ్య బద్దంగా ఓటు హక్కును వినియోగించుకున్న గ్రామస్థుల స్పందన అభినందనీయమని స్థానిక ఎన్నికల అధికారులు వెల్లడించారు.