మృతుల కుటుంబాలను పరామర్శించి అండగా ఉంటామన్న మంత్రి పొన్నం ప్రభాకర్
రిపోర్టర్: Damidi Chandra Reddy
స్థలం: హుస్నాబాద్
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం సైదాపూర్ మండలంలో పలువురు మృతుల కుటుంబాలను బుధవారం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పరామర్శించారు. మృతుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు. ప్రభుత్వపరంగా అన్ని విధాల అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.