తరగతి గదుల్లో పచ్చదనాన్ని పంచుతున్న పర్యావరణ పాఠాలు
రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్
స్థలం: నగరి
పర్యావరణ పరిరక్షణను విద్యార్థుల దైనందిన జీవితంలో భాగంగా మార్చాలని, పాఠశాలలను పర్యావరణహితంగా తీర్చిదిద్దేందుకు ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించాలని ఏపీ నేషనల్ గ్రీన్ కార్ప్స్ జిల్లా కోఆర్డినేటర్ బాల చైతన్య సూచించారు. నగరిలోని పీసీఎన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రెవెన్యూ డివిజనల్ స్థాయి పర్యావరణ వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐదు మండలాల గ్రీన్ టీచర్లు పాల్గొని శిక్షణ పొందారు.