ఆకాశంలో ఎగిరిన సాంకేతికతతో అన్నదాత కష్టాలు దూరం

రిపోర్టర్: PRASAD స్థలం: బెల్లంపల్లి

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం గురజాల గ్రామ శివారులో ఆత్మ ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ అధికారులు డ్రోన్లతో ఎరువులు, పురుగుమందుల పిచికారీపై రైతులకు ప్రత్యక్ష ప్రదర్శన ద్వారా అవగాహన కల్పించారు. మండల వ్యవసాయ అధికారి ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ డ్రోన్ల వినియోగంతో తక్కువ సమయంలో, తక్కువ శ్రమతో పాటు మందుల వాడకం ముప్పై శాతం వరకు తగ్గుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఏఈఓలు గౌసియా, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.