ఒడిశా అడవుల్లో అరుదైన ఒరంగుటాన్లు కలకలం
రిపోర్టర్: రమేష్
స్థలం: ఒడిశా
ఒడిశాలోని బాలాసోర్ జిల్లా అడవుల్లో ఐదు అరుదైన ఒరంగుటాన్లు కనిపించడం సంచలనం రేపింది. భోగ్రాయ్ ప్రాంతంలో వీటిని గుర్తించిన స్థానికులు అటవీశాఖకు సమాచారం అందించారు. అధికారులు వాటిని రక్షించి, వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇండోనేషియా, మలేషియా ప్రాంతాలకు చెందిన ఇవి ఇక్కడకు ఎలా వచ్చాయనే కోణంలో వన్యప్రాణి అక్రమ రవాణా ముఠాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.