తెలంగాణలో పాఠశాల విద్యార్థుల వివరాలపై గందరగోళం: రెండొ లక్షల మంది సమాచారం ప్రశ్నార్థకం

రిపోర్టర్: సతీష్ స్థలం: హైదరాబాద్

తెలంగాణ పాఠశాలల్లో గత విద్యాసంవత్సరానికి సంబంధించి సుమారు రెండు లక్షల ఏడు వేల మంది విద్యార్థుల సమాచారం ప్రశ్నార్థకంగా మారిందని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. కొత్త విద్యాసంవత్సరం ప్రారంభమై నాలుగు నెలలు దాటినా యూడైస్ పోర్టల్ డ్రాప్బాక్స్లో విద్యార్థుల పేర్లు అలాగే నిలిచిపోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. వృత్తి విద్యా కోర్సుల్లో చేరడం, సరిగ్గా నమోదు కాకపోవడం వంటి కారణాలతో ఈ పరిస్థితి తలెత్తినట్లు అధికారులు స్పష్టం చేశారు.