వైభవంగా ఖైరతాబాద్ మహా గణపతి తొలి పూజ ప్రారంభం

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: హైదరాబాద్

ఖైరతాబాద్‌లో ప్రసిద్ధి గాంచిన వినాయక చవితి వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. నేడు ఉదయం 11 గంటలకు గవర్నర్ దంపతుల చేతుల మీదుగా మహా గణపతికి తొలి పూజ నిర్వహించారు. ఈ ఏడాది 72వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన ఉత్సవాల్లో భాగంగా 69 అడుగుల భారీ ఎత్తున పంచముఖ సంకటహర మహాగణపతిని ప్రతిష్టించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని నిర్వాహకులు ఏర్పాట్లు చేయగా, పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.