ఎన్నికల హింసాత్మక ఘటనలపై సీఈవో వివేక్ యాదవ్ సీరియస్
రిపోర్టర్: రమేష్
స్థలం: ఆంధ్రప్రదేశ్
ఎన్నికల ప్రక్రియ ముగిసిన అనంతరం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలను అత్యంత తీవ్రంగా పరిగణించాలని, వీటిపై ప్రత్యేక దృష్టి సారించి వేగవంతమైన చర్యలు తీసుకోవాలని అధికారులను సీఈవో వివేక్ యాదవ్ ఆదేశించారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన సమీక్షలో చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు.