మన్మోహన్ సింగ్కు భారత్ రత్న ఇవ్వాలని ప్రధాని మోదీని డిమాండ్ చేసిన సీఎం రేవంత్

రిపోర్టర్: హరి స్థలం: హైదరాబాద్

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు భారత్ రత్న ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీని డిమాండ్ చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మన్మోహన్ సింగ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఆయన, ఆర్థిక వ్యవస్థకు ఆయన చేసిన సేవలను కొనియాడారు. తెలంగాణ ఏర్పాటుకు మన్మోహన్ సింగ్ ఎంతో కృషి చేశారని, ఢిల్లీలో ఆయన పేరుతో విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జస్టిస్ ఎన్వీ రమణతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.