చెన్నై కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిపై ప్రశంసలు కురిపించిన ఫాఫ్ డుప్లెస్సిస్

రిపోర్టర్: రమేష్ స్థలం: Chennai

మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని నాయకత్వ శైలి మరియు మ్యాచ్ను చదివే విధానం ఎంతో ప్రత్యేకమని సౌతాఫ్రికా ఆటగాడు ఫాఫ్ డుప్లెస్సిస్ వెల్లడించారు. చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడిన అనుభవాన్ని గుర్తుచేసుకుంటూ, ఒత్తిడిలోనూ ధోని ప్రశాంతంగా ఉంటూ సహజ సిద్ధంగా నిర్ణయాలు తీసుకుంటారని ప్రశంసించారు. ముందుగానే ప్రణాళికలు రచించడం కంటే మ్యాచ్ పరిస్థితులకు తగ్గట్టుగా స్పందించడమే ఆయన అసలైన బలం అని డుప్లెస్సిస్ కొనియాడారు.