గ్రామాభివృద్ధే లక్ష్యంగా ప్రజలకు అందుబాటులో ఉంటామన్న ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు

రిపోర్టర్: గోపి స్థలం: కామారెడ్డి

కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలో నిర్వహించిన సార్ తో సర్పంచ్ సాబ్ కార్యక్రమంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు, కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ తో కలిసి పాల్గొన్నారు. మద్నూర్ తో పాటు పెద్ద తడ్గూర్, అంతాపూర్, సోమూర్ గ్రామాల్లో పర్యటించి ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.