ప్రశాంత వాతావరణంలో వినాయక చవితి వేడుకల నిర్వహణ
రిపోర్టర్: k. siva prasad
స్థలం: చిట్వేల్
వినాయక చవితి పండుగను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీసు అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు కోడూరు రూరల్ సీఐ డి. శ్రీనివాసులు, చిట్వేల్ ఎస్ఐ ఎస్. వినోద్‌కుమార్ మండలంలోని గ్రామాల్లో పర్యటించారు. వినాయక కమిటీ సభ్యులతో సమావేశాలు నిర్వహించి, పండుగను భక్తిశ్రద్ధలతో ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు. నిమజ్జనం సమయంలో భద్రతా నిబంధనలు పాటించాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా పోలీసులకు సహకరించాలని కోరారు.