ఆస్పత్రి మంచంపై శరద్ పవార్ రాజకీయ మంతనాలు: మహారాష్ట్రలో సంచలన కలకలం

రిపోర్టర్: అశోక్ స్థలం: Mumbai

ఆస్పత్రి మంచంపై ఉన్నప్పటికీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ తన రాజకీయ మంతనాలను కొనసాగిస్తున్నారని రాజకీయ వర్గాలు వెల్లడించాయి. ఛాతి ఇన్ఫెక్షన్ కారణంగా ముంబైలోని ఆస్పత్రిలో చేరిన ఆయనను ప్రత్యర్థి వర్గానికి చెందిన ప్రఫుల్ పటేల్ కలవడం రాష్ట్రంలో పునరేకీకరణ ఊహాగానాలకు తెరతీసింది. మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ కూడా శరద్ పవార్ తో ఫోన్ లో మాట్లాడటం ఎన్డీయే కూటమిలోకి ఆయన చేరికపై జాతీయ స్థాయిలో తీవ్ర చర్చకు దారితీసింది.