ప్రతి ఒక్కరూ విద్యుత్ పొదుపును బాధ్యతగా పాటించాలి: సీఈ బాలస్వామి

రిపోర్టర్: రమేష్ స్థలం: చౌటుప్పల్

ఎల్నినో ప్రభావంతో విద్యుత్ ఉత్పత్తి తగ్గి వినియోగం పెరుగుతోందని రూరల్ జోన్ సీఈ బాలస్వామి తెలిపారు. చౌటుప్పల్ లోని విద్యుత్ సబ్స్టేషన్ లో నిర్వహించిన జాతీయ విద్యుత్ వినియోగదారుల దినోత్సవంలో ఆయన మాట్లాడారు. అవసరం లేనప్పుడు లైట్లు, ఫ్యాన్లు ఆ చేయాలని సూచించారు. రైతులు నాణ్యమైన పంపుసెట్లు వాడాలని, విద్యుత్ ప్రమాదాల నివారణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.