తీవ్ర కరవు ముప్పును ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ సహా దక్షిణ భారతం
రిపోర్టర్: రమేష్
స్థలం: ఆంధ్రప్రదేశ్
దేశంలోని మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌తో పాటు దక్షిణ భారతం తీవ్ర కరవు ముప్పును ఎదుర్కొంటోందని శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడైంది. 1990కి ముందు పది శాతం ప్రాంతంలోనే ఉన్న క్షామ పరిస్థితులు 2000 తర్వాత నూటికి నలభై శాతానికి విస్తరించినట్లు ఐఎండీ, ఇతర సంస్థల పరిశోధకులు తెలిపారు. ఏపీ, ఒడిశా, తమిళనాడుతో కూడిన తూర్పుతీర ప్రాంతం తీవ్ర కరవు హాట్‌స్పాట్‌గా మారిందని, దీర్ఘకాలిక నీటి ఎద్దడి పొంచి ఉందని నిపుణులు హెచ్చరించారు.