బట్టలు వాడుకున్నాడని స్నేహితుడిని కొట్టి చంపిన వ్యక్తి
రిపోర్టర్: విజయ్
స్థలం: మహారాష్ట్ర
ముంబైలోని గోరేగావ్‌లో వ్యక్తిగత వస్తువులు, బట్టలు అనుమతి లేకుండా వాడుకున్నాడన్న కోపంతో ఓ యువకుడు తన స్నేహితుడిని దారుణంగా కొట్టి చంపాడు. మీరా రోడ్‌కు చెందిన సూరజ్ శంకర్ డోలే(26), నిందితుడు బాబాసాహెబ్ ఇద్దరూ సహోద్యోగులు. వివాదం ముదరడంతో బాబాసాహెబ్ సూరజ్‌పై దాడి చేసి హత్య చేశాడు. పోలీసులు నిందితుడిపై హత్య కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు.