తీరానికి తుఫాను ముప్పు: బాపట్ల జిల్లాలో పోలీస్ యంత్రాంగం హైఅలర్ట్
రిపోర్టర్: గోపి
స్థలం: బాపట్ల
ఆర్నాబ్ తుఫాన్ ముప్పు పొంచివున్న నేపథ్యంలో బాపట్ల జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు వేటపాలెం, రూరల్, అడవులదీవి, చెరుకుపల్లి మరియు చుండూరు పోలీస్ స్టేషన్ల సిబ్బంది పూర్తిగా అప్రమత్తమయ్యారు. ప్రజల రక్షణ కోసం అన్ని ముందస్తు భద్రతా చర్యలను ముమ్మరం చేసినట్లు Bapatla Police వెల్లడించారు. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర సమయాల్లో పోలీసులను సంప్రదించాలని అధికారులు స్పష్టం చేశారు.