పోక్సో నిందితుడి బరితెగింపు: బాధితురాలి గొంతు కోసేందుకు యత్నించిన కామాంధుడు అరెస్ట్

రిపోర్టర్: భాస్కర్ స్థలం: Ernakulam

పోక్సో కేసులో బెయిల్ పై బయటకు వచ్చిన నిందితుడు బాధితురాలిని హతమార్చేందుకు యత్నించిన దారుణ ఘటన కేరళలోని ఎర్నాకుళం జిల్లాలో సోమవారం చోటుచేసుకుంది. పెరుమాని ప్రాంతానికి చెందిన మహమ్మద్ అద్నాన్ మధ్యాహ్నం సమయంలో బాలిక ఇంటిలోకి చొరబడి కత్తితో దాడి చేశాడు. అప్రమత్తమైన స్థానిక యువకుడు సాహసించి అడ్డుకోవడంతో బాలిక ప్రాణాలతో బయటపడింది. తీవ్రంగా గాయపడిన బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. పరారీలో ఉన్న నిందితుడిని అటవీ ప్రాంతంలో అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.