రేణిగుంటకు చేరుకున్న యోగి ఆదిత్యనాథ్.. ఘన స్వాగతం పలికిన కలెక్టర్
రిపోర్టర్: మదన్ రాయల్
స్థలం: తిరుపతి అర్బన్
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తిరుపతి పర్యటనలో భాగంగా రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు విమానాశ్రయంలో ఆయనకు ఘన స్వాగతం పలికి, మర్యాదపూర్వకంగా పుష్పగుచ్ఛం అందజేశారు.
జిల్లా అధికారుల సమక్షంలో జరిగిన ఈ స్వాగత కార్యక్రమం అనంతరం, ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లను పోలీసు అధికారులు పర్యవేక్షించారు. యోగి ఆదిత్యనాథ్ పర్యటన నేపథ్యంలో విమానాశ్రయం వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.