ఉంగుటూరులో హైటెన్షన్గా మారిన పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలు

రిపోర్టర్: విజయ్ స్థలం: ఏలూరు

ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం కైకరం జడ్పీ ఉన్నత పాఠశాల ఎస్ఎంసీ ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలను తలపిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో తెదేపా, జనసేన నాయకులు తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు హోరాహోరీగా తలపడుతున్నారు. ఓటర్లైన తల్లిదండ్రులకు డబ్బులు, చీరలు పంపిణీ చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా నిడమర్రు సీఐ రజనీ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పాఠశాల లోపలికి కేవలం తల్లిదండ్రులను మాత్రమే అనుమతిస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.