'ప్రభుత్వ భూముల రికవరీకి సిద్ధం': కేసీఆర్ ఫామ్‌హౌస్‌పై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

రిపోర్టర్: రాము స్థలం: హైదరాబాద్

తెలంగాణ శాసనసభ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్ష బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో ధరణి పోర్టల్ ద్వారా జరిగిన అక్రమాలను ఎండగట్టిన సీఎం, కేసీఆర్ కుటుంబానికి చెందిన భూముల లెక్కలను సభ ముందుంచారు. ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్‌హౌస్ పరిధిలో ప్రభుత్వ భూమి ఉందని, అక్రమంగా సంపాదించిన ప్రతి అంగుళం భూమిని వెనక్కి రికవరీ చేస్తామని ఆయన హెచ్చరించడంతో రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపింది.